పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడుద్దాం

53చూసినవారు
పాపన్న గౌడ్ అడుగుజాడలలో నడుద్దామని దస్తురాబాద్ మండల గౌడ సంఘం నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం దస్తురాబాద్ మండల కేంద్రంలో వారు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పాపన్న గౌడ్ అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్