షెడ్లు నిర్మించి ఆదుకోవాలి

51చూసినవారు
షెడ్లు నిర్మించి ఆదుకోవాలి
జన్నారం పట్టణంలో కూరగాయలు అమ్ముకునే తమకు షెడ్లు నిర్మించి ఇబ్బందులను తొలగించాలని చిరు వ్యాపారులు కోరారు. జన్నారం పట్టణం నాలుగైదు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. దీంతో పలు ప్రాంతాల నుండి చిరు వ్యాపారులు కూరగాయలు, వివిధ వస్తువులను అమ్మేందుకు వస్తుంటారు. ప్రధాన రహదారి పక్కన కూర్చుని వారు వాటిని అమ్ముతుంటారు. ఎండా, వాన కాలంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, తమకు షెడ్లు నిర్మించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్