చిన్న పరిశ్రమలు స్థాపించాలి

65చూసినవారు
చిన్న పరిశ్రమలు స్థాపించాలి
ఖానాపూర్ నియోజకవర్గంలో చిన్న పరిశ్రమలను స్థాపించాలని స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులు కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవన్నారు. అలాగే వ్యవసాయపరంగా కూడా ఉపాధి దొరకడం లేదని, దీంతో తాము ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఖానాపూర్ నియోజకవర్గంలో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి తమకు ఉపాధిని కల్పించాలని నిరుద్యోగ యువతీ, యువకులు కోరారు.

సంబంధిత పోస్ట్