రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను దళిత సేన నిర్మల్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కలిశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన సిరిసిల్ల రాజయ్యను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాజయ్యను ఆయన శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత సేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.