ఏజెన్సీ రైతులకు రుణమాఫీ చేయాలి

77చూసినవారు
ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం పంట రుణమాఫీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ చౌహన్ డిమాండ్ చేశారు. పంట రుణమాఫీ చేయాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని గ్రామీణ బ్యాంకు ముందు ఆందోళన చేశారు. ఏజెన్సీ ప్రాంత రైతులకు పట్టాలు ఇచ్చిన పంట రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కూడా పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్