ఆదివాసులు, గిరిజనుల అభివృద్ధికి ఉట్నూర్ ఐటిడిఏ కృషి చేస్తుందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆదివాసి, గిరిజనుల అభివృద్ధికి ఐటిడిఏ పరంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు.