శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి

53చూసినవారు
శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి
వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరాన్ని యువత వినియోగించుకోవాలని జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ జడ్పీ పాఠశాల హెచ్ఎం కట్ట రాజమౌళి కోరారు. బుధవారం ఆ పాఠశాలలో ఏర్పాటుచేసిన వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పీడీ బోర్లకుంట సాగర్ శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్