విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించాలి
కుంటాల మండలంలో మంగళవారం నేషనల్ అచీవ్మెంట్ సర్వే పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వాటోలి ముత్యం మాట్లాడుతూ, విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించి ఆశించిన అభ్యాసన ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు కృశి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బరుకుంట నవీన్, సుధాకర్, ప్రవీణ్ కుమార్, వివేకానంద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.