గడ్డెన్న వాగులోకి 463 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో

67చూసినవారు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 463 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శనివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 357. 20 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. భారీగా వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్