గంగా జలాలతో గ్రామదేవతలకు అభిషేకం

73చూసినవారు
భైంసా మండలంలోని వాటోలి గ్రామంలో గంగ నుంచి తీసుకు వచ్చిన జలాలతో ఆదివారం గ్రామదేవతలకు పూజలు అంగరంగ వైభవంగా చేశారు. డప్పు వాయిద్యాల నడుమ, వేప కొమ్మలు చేతిలో పట్టుకొని, నృత్యాలు చేస్తూ గంగమ్మ నుండి పవిత్ర జలాలను గ్రామంలోకి తీసుకు వచ్చి గ్రామదేవతలకు అభిషేకం, పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్