భైంసా మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టివార్ ఇటీవల మృతి చెందారు. బుధవారం మున్సిపల్ పాలక వర్గం చైర్మన్ సభియా భేగం అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ వైస్ చెర్మెన్ జాబిర్ హైమద్ పాల్గొన్నారు.