భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. గురువారం సీసీఐ రూ. 7, 521, ప్రైవేటు పత్తి ధర రూ. 7, 000 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. బుధవారం ధరలతో పోలిస్తే ప్రైవేటు, సీసీఐలో ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కనీస మద్దతు ధర 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.