కుంటాల మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన పశువుల కాపరి మొదెల్ల భూమన్నపై సోమవారం అడవి పంది దాడిచేసింది. స్థానికు తెలిపిన వివరాల ప్రకారం భూమన్న రోజు మాదిరిగానే పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అడవిలో ముళ్లపొదల నుంచి దూసుకొచ్చిన అడవిపంది దాడి చేసింది. దీంతో ఆయన తొడ భాగంలో తీవ్ర గాయం అయింది. కుటుంబ సభ్యులు 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి, మెరు గైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.