గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ గణేష్ సూచించారు. బుధవారం బాసర మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల శాంతి సమావేశంలో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. నిమజ్జనం సమయంలో చెరువులు, నదుల వద్ద జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు.