బాసర మండల కేంద్రంలోని నూతన పద్మనాయక వెలమ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రోసిడింగ్ కాఫీని ఆయన నివాసంలో సంఘం కమిటీ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల మతాలకు అతీతంగా సంఘం భవన నిర్మాణం కొరకై ప్రత్యేక నిధులను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగరావు తదితరులు పాల్గొన్నారు.