కుబీర్: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

78చూసినవారు
కుబీర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు యశోద బాయి అనే మహిళ ఇటీవల వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురై మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావ్ పటేల్ శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తనవంతు సహాయంగా 10 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మాజీ ఎంపీపి సుభాష్ పటేల్ పుప్పాల లింగం, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్