డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ జరుగబోయే సింహా గర్జన సభకు కుబీర్ మండలంలోని అన్ని గ్రామాలనుండి అధిక సంఖ్యలో మాలలు హాజరై సభను విజయవంతం చేయాలని ముధోల్ నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శంకర్ చంద్రే కోరారు. మంగళవారం మండల కేంద్రంలో పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు సందీప్, గిరిదారి జంగ్మే గౌతం పింగ్లే, మగ్గిడి దిగంభర్ తదితరులు పాల్గొన్నారు.