కుబీర్ మండలకేంద్రంలోని విట్టలేశ్వరా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అష్టసిద్ధి కర్ర వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు. కుబీర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షులు ఉప్పు ధోని దత్తు రూ.41 వేలకు లడ్డూని దక్కించుకున్నారు. పదకొండు రోజులపాటు విశేషా పూజలందుకున్న లడ్డూ దక్కడంతో సంతోషంగా ఉందని భక్తుడు గురువారం తెలిపాడు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.