గుండెపోటుతో మిషన్ భగీరథ వాటర్ మెన్ మృతి

70చూసినవారు
విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మరణించిన ఘటన గురువారం ముథోల్ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఎడ్బిడ్ గ్రామానికి చెందిన ప్రభాకర్ గ్రామంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. కాగా గత ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, మృతుని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కుటుంబాన్ని మిషన్ భగీరథ ఏజెన్సీ వారు అదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్