తానూర్ మండలం సింగన్ గావ్ గ్రామంలో అన్నాబావు సాఠే 104 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం సాఠే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘ నాయకులు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.