స్కూల్ స్థాయిలో ఆహార భద్రత కమిటీలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని ముథోల్ మండల విద్యాధికారి రమణ రెడ్డి శుక్రవారం తెలిపారు. ముథోల్ మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన భద్రత కమిటీల ఏర్పాటుపై ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రమణ రెడ్డి మాట్లాడుతూ కమిటీల ఏర్పాటులో పోషకులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, పాఠశాల అభివృద్ధికి కమిటీలు ఎంతో మేలు చేస్తాయన్నారు.