రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలి

55చూసినవారు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రగతిశీల మహిళ సంఘం( పిఓడబ్ల్యు) ఆధ్వర్యంలో శుక్రవారం భైంసా పట్టణ కేంద్రంలోని బస్సు ప్రయాణ ప్రాంగణం ముందర ధర్నా చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తున్నారని, రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్