కోల్ కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య నిరసనగా శనివారం 24 గంటల పాటు ఓపీ సేవలు ఇలిపోయివస్యనున్నట్లుఐఎంఏ భైంసా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా. రాజేశ్వర్ రావు, డా. సూర్యకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు అవుట్ పేషంట్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.