లోకేశ్వరం మండలంలోని నర్సింహనగర్ తండాకు చెందిన జాదవ్ మోహన్(33) అనే వ్యక్తి తాగుడికి బానిసై ఈ నెల 11న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. తల్లి శోభాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.