కుంటాల: రైతులకు అందుబాటులో శనగ విత్తనాలు

65చూసినవారు
కుంటాల: రైతులకు అందుబాటులో శనగ విత్తనాలు
నిర్మల్ జిల్లా కుంటాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంలో రబీ సీజన్లో సాగు చేసేందుకు శుక్రవారం నుండి శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, సీఈవో నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. 25 కేజీల బస్తా ధర రూ 2, 250 ఉందని, కావాల్సిన రైతులు ఆధార్ కార్డు, పట్టా పుస్తకం జీరాక్స్ తో వచ్చి విత్తనాలను తీసుకెళ్లాలని వారు కోరారు.