భైంసా మండలం ఈలేగం గ్రామానికి చెందిన కవి, రచయిత, మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ తెలుగు సాహిత్యంలో చేస్తున్న కృషికి ఆదివారం మంచిర్యాలలో ఆదర్శ కళా సేవా సంస్థ అధ్యక్షులు లింగంపేల్లి రాజలింగం ఆదర్శ రత్న అని బిరుదును ఇచ్చి నంది అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమంలో రెలారే రేలా రవి, గాయకులు కిషోర్, తదితరులు పాల్గొన్నారు.