ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి-మాల మహానాడు సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. గౌతం బౌద్ధునికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌక్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ శ్రీకాంత్కు వినతి పత్రాన్ని అందజేశారు.