ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

57చూసినవారు
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పరిసరాలను పరిశీలించి, ఆస్పత్రిలోని రోగులతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో ఆస్పత్రి వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్