సోన్ మండలం సంఘంపేట గ్రామంలో గురువారం డ్రీం సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. కోఆర్డినేటర్ చిన్నయ్య మాట్లాడుతూ పేటీఎం తదితర ఆప్ ల గురించి వివరించారు. పోస్టల్ బీమా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ బ్యాంకులలో లోన్ పొందే విధానాన్ని తెలిపారు. ఇందులో మహిళా సంఘాల సభ్యులు, వివోఏ తదితరులు పాల్గొన్నారు.