నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు తిరుమల నర్సింగ్ హోమ్ డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తల్వేద గ్రామంలో మంగళవారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.