ఆశావర్కర్ల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా మహాసభలకు ఆమె హాజరయ్యారు. గత ప్రభుత్వం ఆశావర్కర్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.