నిర్మల్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో ఓపీ సేవలు నిలిపివేత

77చూసినవారు
నిర్మల్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో ఓపీ సేవలు నిలిపివేత
కోల్ కతాలో చోటుచేసుకున్న పీజీ వైద్యురాలి హత్యాచారం ఘటనకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను శనివారం నిలిపివేశారు. కోల్ కతా ఘటన అత్యంత దారుణమని, బాధ్యులను గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయమని ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్