సారంగాపూర్ - Saarangapur Mandal

స్వర్ణ వాగులో యువకుడు మృతదేహం లభ్యం

స్వర్ణ వాగులో యువకుడు మృతదేహం లభ్యం

సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన మేకల దేవేందర్ (30) అనే యువకుడు మృతదేహం గురువారం స్వర్ణ వాగులో లభించింది. మంగళవారం బైక్‌పై నిర్మల్ కి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోగా కుటుంబ సభ్యులు ఆంతటా వెతుకుతుండగా అతని బైక్ ఆలూర్, బోరిగాం గ్రామాల మధ్యలోని కల్వెర్ట్ బ్రిడ్జి వద్ద కనిపించింది. తండ్రి దేవన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. స్వర్ణ వాగులో వెతికించగా అతని మృతదేహం కనిపించింది.

నిర్మల్ జిల్లా