వంట చేసేటప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కారణం వీటిని కోసినపుడు చేతులు మండటం, కళ్లల్లోంచి నీరు కారడం జరగుతుంది. కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చేతులు మండకుండా పచ్చిమిర్చిని కత్తెరతో కట్ చేసుకోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతుంటే.. పంచదారతో చేతులను రుద్దుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఉల్లిగడ్డలను కోసే ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచి కట్ చేస్తే కన్నీళ్లు రావు. చేతులు ఉల్లి వాసన రాకుండా నిమ్మరసం పట్టిస్తే సరి.