పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలను భారత యువషూటర్ మను బాకర్ సాధించిన విషయం తెలిసిందే. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో స్వప్నిల్ కుశాలె కూడా కాంస్యం సాధించారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ యువ విజేతలను శాలువా కప్పి సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.