ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్ సర్వేని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లకు, పంచాయతీ కార్యదర్శికి సర్వేకు సంబంధించి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి నరసయ్య, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి హారిక, ఎన్యూమేరేటర్లు పాల్గొన్నారు.