మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (31) స్నేహితుడి తో కలిసి మంగళవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై మెట్ పల్లి నుండి తిమ్మాపూర్ వెళ్తుండగా మార్గమధ్యలో కమ్మర్ పల్లి ఊరి మధ్యలోకి రాగానే ఆంధ్ర బ్యాంకు ముందర చైనా మాంజా కనబడకపోవడంతో గొంతుకు గాయమైంది. వెంటనే కమ్మర్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.