ఆర్మూర్ మండలం కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకి చెందిన బి. అఖిలేష్, ఆర్. ఆదిత్య రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పూర్ణచందర్రావు శనివారం తెలిపారు. మంచిర్యాలలో డిసెంబర్ 1, 2 తేదీలలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ సాయన్న, పీడీ బి. జ్ఞానేశ్వర్, పీఈటి రాజేందర్, నరేష్ అభినందించారు.