ఆర్మూర్ లో బుధవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించే మాసోత్సవాలలో భాగంగా ఆర్మూర్ mvi వివేకానందరెడ్డి అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాయింట్ ట్రాన్సుపోర్టు కమిషనర్ మామిల్ల చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత మన సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. 75 శాతం మరణాలు మనవతప్పిదం వల్ల జరుగుతున్నాయని అన్నారు.