మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

54చూసినవారు
మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్ పట్టణం మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించామని చైర్ పర్సన్ తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటల నుండి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ సంబరాలు జయప్రదం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్