జక్రాన్ పల్లి మండలం మునిపల్లిలోని స్థానిక గెత్సేమనే ప్రేయర్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు దీవెనలు ముని పల్లి గ్రామ ప్రజలపై ఉండాలని కోరారు. అనంతరం చర్చ్ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకరికొకరు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.