నందిపేట మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవిని వీధుల వెంట యువకుల తీన్మార్ స్టెప్పులతో అమ్మవారి శోభాయాత్ర దద్దరిల్లింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని శోభయాత్రను ఘనంగా జరిపించారు. దుర్గామాత ఉరేగింపు తరించటానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.