ఎడపల్లి మండలం ఠానాకాలన్ గ్రామంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమాన్ మందిరంలో యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ యజ్ఞ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగుతుందని, శనివారం దత్త జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.