వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం కచేరి దగ్గర గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి కర్ణాకర్ శర్మ తెలిపారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.