కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బాన్సువాడ మండలం కొల్లూరు, దామరంచ రహదారి మధ్యలో బైక్పై ఓ వ్యక్తి వేగంగా వెళ్తూ ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలవడంతో స్పాట్లోనే మృతి చెందాడు. మృతుడు బోర్లం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పోచయ్యగా గుర్తించినట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.