ఎడపల్లి మండలం జానకంపేట్ సొసైటీలో శుక్రవారం పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిన సందర్భంగా సొసైటీ నుండి తిరిగి కొత్తగా 87 మంది రైతులకు రూ 32,98,000 పంట రుణాల చెక్కులను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు, కార్యదర్శి ఆర్. గంగారెడ్డి, రైతులు మరియు సొసైటీ సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.