ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఇందల్ వాయి ఎస్హెచ్ఓ మనోజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు 15 ఆగస్టు నుండి ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు.