రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాదు నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు. మాణిక్ భవన్, గుండారం, శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆర్చిడ్, సెయిట్ జేవియర్ పాఠశాలల
విద్యార్థులకు సైకిళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ వైద్యులు ఎం. భూంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.