నిజామాబాద్: మూడేళ్ల కూతురును హత్య చేసిన తల్లితో పాటు మరోవ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి. శ్రీనివాస్ బుధవారం తీర్పు వెల్లడించారు. జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కికి చెందిన సంజీవ్, మోర్తాడ్ కు చెందిన కూలీ రజిత అలియాస్ రాధతో సహజీవనం చేస్తూ.. రాధ కూతురు తమకు అడ్డుగా ఉందని భావించారు. దీనితో 2023 ఏప్రిల్ 10న చిన్నారిని కొట్టి నీటిలో ముంచి చంపినట్లు కేసు నిర్దారణ అయ్యింది.