చందూర్ మండల శివారులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చందూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు పై ప్రయాణం చేస్తున్న సమయం లో గుర్తు తెలియని వాహనం తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్సు లో ఆసుపత్రి కి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.